News3rd May 01:16 PMSunil Byrisetty1 min read

ఘనంగా డాక్టర్ ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలు

తెలుగు జాతి గుండె చప్పుడు డా. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ సాంస్కృతిక పురస్కారోత్సవం - డాక్టర్ ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలు ఘనంగా జరిగాయి. విజయవాడ హోటల్ ఐల

ఘనంగా డాక్టర్ ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలు
తెలుగు జాతి గుండె చప్పుడు డా. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ సాంస్కృతిక పురస్కారోత్సవం - డాక్టర్ ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలు ఘనంగా జరిగాయి. విజయవాడ హోటల్ ఐలాపురంలో పాన్ ఇండియన్ సోషల్ కల్చరల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి పురస్కారాలు అందచేశారు. ఈ సందర్భంగా తెలుగుజాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ అరంగేట్రంతో సినీ పరిశ్రమ, రాజకీయాలు మారిపోయాయన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ కో-ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, అంతర్జాతీయ శ్రీశ్రీ కళా వేదిక సీఈఓ కళారత్న కత్తిమండ ప్రతాప్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, ఓసీసీఐ న్యూఢిల్లీ నేషనల్ చీఫ్ అడ్వజయిర్ డా. గుంజి నరసింహారావు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Vijayawada
NTR cine vajrostava vedukalu
Nandamuri Taraka Rama Rao
Mandali Buddha Prasad
డాక్టర్ ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలు
హోటల్ ఐలాపురంలో పాన్ ఇండియన్ సోషల్ కల్చరల్
Scroll for the next article