Spiritual2nd Aug 11:10 AMSunil Byrisetty1 min read

స్నేహమంటే ఇదేరా!

శ్రీకృష్ణుడు, కుచేలుడి స్నేహం ప్రపంచంలోనే ఆదర్శవంతమైన, నిష్కల్మషమైన స్నేహానికి అత్యుత్తమ నిదర్శనం. హోదా, సంపద, అంతస్తులతో సంబంధం లేనిది నిజమైన స్నేహం అని చాటిచెప్పే అత్యంత పవిత్రమై

స్నేహమంటే ఇదేరా!
శ్రీకృష్ణుడు, కుచేలుడి స్నేహం ప్రపంచంలోనే ఆదర్శవంతమైన, నిష్కల్మషమైన స్నేహానికి అత్యుత్తమ నిదర్శనం. హోదా, సంపద, అంతస్తులతో సంబంధం లేనిది నిజమైన స్నేహం అని చాటిచెప్పే అత్యంత పవిత్రమైన కథ ఇది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహానికి నిర్వచనం అయిన వారి మిత్రత్వం గురించి తెలుసుకుందాం. వీరిద్దరూ సాందీపని మహర్షి ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. కాలక్రమంలో శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కుచేలుడు మాత్రం తీవ్రమైన పేదరికంలో కూరుకుపోయాడు. ఎంత పేదరికంలో ఉన్నా కుచేలుడు ఎప్పుడూ ఎవరినీ ఏదీ యాచించలేదు. చివరకు భార్య వేడుకోలు మేరకు, తన బాల్య మిత్రుడైన కృష్ణుడిని చూడటానికి ద్వారకకు బయలుదేరాడు. కృష్ణుడికి ఇవ్వడానికి ఇంట్లో ఏమీ లేకపోతే, పొరుగువారి ఇంట్లో అడిగి తెచ్చిన కొద్ది అటుకులను చిరిగిన వస్త్రంలో తీసుకెళ్తాడు. కుచేలుడిని చూసి శ్రీకృష్ణుడు సింహాసనం దిగి పరుగెత్తుకుంటూ వచ్చాడు. మిత్రుడిని కౌగిలించుకుని, సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కుచేలుడిని సింహాసనంపై కూర్చోబెట్టి, స్వయంగా కాళ్ళు కడిగాడు. నా కోసం ఏం తెచ్చావని అడిగితే.. కుచేలుడు అటుకుల మూటను తీయడానికి సంకోచించాడు. కానీ, కృష్ణుడు అటుకులను ఇష్టంగా తిన్నాడు. కృష్ణ ఆశీర్వాదంతో కుచేలుడికి ఇహలోక సంపదలన్నీ, పరలోక భోగాలు లభించాయి. ఈ కథ అంతస్తులు చూడని ప్రేమానురాగాలను స్నేహంలోని మాధుర్యాన్ని వివరిస్తుంది.
Inspirational story
Friendship Day
Krishna
Sudama
Kuchela
Krishna Sudama
True Friendship
Lord Krishna
Indian Mythology
Hindu Stories
అటుకులు
భారతీయ సంస్కృతి
పురాణ కథలు
స్నేహం
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణుడు కథ
Scroll for the next article