News5th Dec 04:47 PMSunil Byrisetty1 min read

విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లు (సంగీత నాటక అకాడమీ), రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో 2025 ఎడిషన్ కృష్ణవేణి సంగీత

విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లు (సంగీత నాటక అకాడమీ), రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో 2025 ఎడిషన్ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కేంద్ర టూరిజం శాఖ సంచాలకులు (సౌత్) డి. వెంకటేశన్ తెలిపారు. విజయవాడ ఈ ప్రాంతానికున్న గొప్ప సంగీత వారసత్వాన్ని పురస్కరించుకొని సంగీత ప్రియులను అలరించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయ కర్ణాటక సంగీతాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా 2025 సంవత్సరానికి తెలుగు సంగీత సంప్రదాయాల గొప్పతనం అనే థీమ్ సంగీత సంప్రదాయాలను హైలైట్ చేస్తుందన్నారు. హరికథ, సంకీర్తన, వీణా కచేరీలు, గాత్ర కచేరీలు, పంచరత్న కృతులు వంటి సామూహిక ప్రదర్శనలు ఉంటాయని, ప్రఖ్యాత సంగీత కళాకారులు, రాష్ట్రంతోపాటు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సంగీత సంస్ధలు నుండి విద్యార్థులు పాల్గొంటారన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం దాని సంగీత ప్రదర్శనలతోపాటు క్రాఫ్ట్ బజార్లు, చేనేత ప్రదర్శనలు, స్థానిక కళాకారులు, నేత కార్మికులు సమగ్ర సాంస్కృతిక ప్రదర్శనలు అందిస్తారన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం సంగీత ప్రియులను, విద్యార్థులను, సాంస్కృతిక ఔత్సాహికులను, వారసత్వం, భక్తి మరియు కళాత్మకత మరపురాని వేడుకలకు స్వాగతిస్తుందన్నారు. తదనంతరం కృష్ణ వేణీ సంగీత నీరాజనం కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు.
South Indian Arts
Krishnaveni Sangeeta Neerajanam
Vijayawada Events
Classical Music Festival
Carnatic Music
Cultural Heritage
Music Traditions
Telugu Music Culture
Harikatha
Veena Concerts
Panchratna Kritis
Scroll for the next article