News13th Oct 11:15 AMSunil Byrisetty1 min read

సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా విశ్వనాథన్

ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా కె.ఎస్. విశ్వనాథన్ సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖ సంచాలకులుగా ఉన్న హిమాన్షు శుక్లా శ్ర

సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా విశ్వనాథన్
ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా కె.ఎస్. విశ్వనాథన్ సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖ సంచాలకులుగా ఉన్న హిమాన్షు శుక్లా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసిన అనంతరం ప్రఖర్ జైన్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. విశాఖ మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ కమిషనర్ గా ఉన్న కె.ఎస్. విశ్వనాథన్ ను సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్ గా, నరసాపురం సబ్ కలెక్టర్ గా, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాఖ కార్యకలాపాలు, నిర్వర్తిస్తున్న విధులపై అధికారులతో నూతన సంచాలకులు సమీక్షించారు.
Andhra Pradesh
Information Department
Public Relations
K.S. Viswanathan
IAS
Administration
Visakhapatnam
DIPR
ప్రభుత్వం నియామకం
ప్రభుత్వ అధికారుల బదిలీలు
ఏపీ డీఐపీఆర్
హిమాన్షు శుక్లా
ప్రఖర్ జైన్
Scroll for the next article