Telangana16th Jun 12:39 PMSunil Byrisetty1 min read
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేసు కేసును ఏసీబీ విచారిస్తోంది. విచారణకు హాజరయ్యే ముందు ఆయన కేసీఆర్, మాజీ మంత్రి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేసు కేసును ఏసీబీ విచారిస్తోంది. విచారణకు హాజరయ్యే ముందు ఆయన కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలనికి చేరుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘విచారణకు రమ్మని ఇప్పటికే మూడుసార్లు పిలిచారు.. ఇంకో 30 సార్లు పిలిచినా వస్తా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా.. ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను’’ అంటూ వ్యాఖ్యానించారు.