News17th Apr 03:35 PMSunil Byrisetty1 min read

తెలంగాణలోనూ బంగ్లాదేశ్‌లా ప్రజలే తిరగబడతారు!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్‌పై సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అధికార మదంతో

తెలంగాణలోనూ బంగ్లాదేశ్‌లా ప్రజలే తిరగబడతారు!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్‌పై సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అధికార మదంతో విర్రవీగి రారాజులం, నియంతలం అని భావిస్తే అది పొరపాటన్నారు. గచ్చిబౌలి హెచ్‌సీయూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజా స్వామ్యాన్ని కాపాడాయని, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఆత్మాభిమానం ఉన్న ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టుడు ఏంది.. బంగ్లాదేశ్‌లాగా ప్రజలే కూలగొడతార’ని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ఖర్మ తమకేం పట్టలేదన్నారు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు.
KTR
HCU Lands Issue
Revanth Reddy
Telangana
Supreme Court
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Scroll for the next article