Telangana24th May 12:05 PMSunil Byrisetty1 min read

కవిత లేఖపై సీరియస్ అయిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై మాజీ మంత్రి, సోదరుడు కేటీఆర్ స్పందించారు. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందంటూ వ్యాఖ్యానించారు. తమ నాయకుడికి ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చన్నారు. అంతర్గ

కవిత లేఖపై సీరియస్ అయిన కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై మాజీ మంత్రి, సోదరుడు కేటీఆర్ స్పందించారు. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందంటూ వ్యాఖ్యానించారు. తమ నాయకుడికి ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చన్నారు. అంతర్గత విషయాలు బయట మాట్లాడకపోతే మంచిదని పేర్కొన్నారు. పార్టీలో అందరం కార్యకర్తలమేనని, అందరూ సమానమేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్‌రెడ్డేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అని, ఆ దెయ్యాన్ని, శనిని వదిలించడమే తమ పని అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. తమ పార్టీలో రేవంత్‌ కోవర్టులు ఉండొచ్చంటూ పరోక్షంగా కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారు.
Telangana
TG Politics
BRS Party
KCR
Kavitha Letter
కవిత లేఖపై సీరియస్ అయిన కేటీఆర్
కవిత లేఖపై మాజీ మంత్రి
సోదరుడు కేటీఆర్ స్పందించారు
Scroll for the next article