Telangana28th Dec 04:07 PMSunil Byrisetty1 min read
జగన్ బాటలో కేటీఆర్
వైఎస్ జగన్ బాటలో కేటీఆర్ నడుస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ర
వైఎస్ జగన్ బాటలో కేటీఆర్ నడుస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
'హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ' పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. మార్కెట్‌లో గజం లక్ష రూపాయలు పలికే భూమిని కేవలం రూ.4,000కే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ 'సేల్ ఆఫర్' చూసి మోసపోవద్దని రియల్ ఎస్టేట్ డెవలపర్లను హెచ్చరించిన కేటీఆర్, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా ఇటీవల మెడికల్ కాలేజీల టెండర్ల విషయంలో జగన్ ఇదే విధంగా హెచ్చరించిన విషయం తెలిసిందే.