Spiritual7th Dec 09:08 AMSunil Byrisetty1 min read

శ్రీశైలంలో మంగళగిరి నాట్యకారిణి ప్రదర్శన

శ్రీశైలం మల్లిఖార్జున స్వామి సన్నిధిలో మార్గశిర ఆరుద్ర సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో మంగళగిరికి చెందిన నాట్యకారిని ( మంగళగిరి శివాలయం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శ

శ్రీశైలంలో మంగళగిరి నాట్యకారిణి ప్రదర్శన
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి సన్నిధిలో మార్గశిర ఆరుద్ర సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో మంగళగిరికి చెందిన నాట్యకారిని ( మంగళగిరి శివాలయం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ కుమార్తె) శ్రీ సమన్విత (8) కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఆదివారాల్లో నృత్య ప్రదర్శన కొనసాగుతుందని మహేష్ శర్మ తెలిపారు. గతంలో రాష్ట్ర స్థాయిలో పలు ప్రాంతాల్లో సమన్విత తన నృత్య ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయ కార్య నిర్వాహణాధికారితో పాటుగా మంగళగిరికి చెందిన పలువురు ప్రముఖులు చిన్నారి సమన్వితకు అభినందనలు తెలియజేస్తున్నారు.
Andhra Pradesh
Srisailam
Kuchipudi
Young Talent
Mangalgiri
Dance Performance
Samanvita
Temple Festivals
కూచిపూడి ప్రదర్శన
దేవాలయ ఉత్సవాలు
సాంస్కృతిక కార్యక్రమాలు
Scroll for the next article