News18th Mar 12:30 PMSunil Byrisetty1 min read

కూచిపూడి ఖ్యాతి.. విశ్వవ్యాప్తం

కూచిపూడి భరతనాట్యం పేరు వినని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా కూచిపూడికి పేరు తెచ్చిన అరుదైన కళారూపం అది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని కూచిపూడి నుంచి ఎంతోమంది ప్రముఖులు ఖండాంతరాల్లో

కూచిపూడి ఖ్యాతి.. విశ్వవ్యాప్తం
కూచిపూడి భరతనాట్యం పేరు వినని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా కూచిపూడికి పేరు తెచ్చిన అరుదైన కళారూపం అది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని కూచిపూడి నుంచి ఎంతోమంది ప్రముఖులు ఖండాంతరాల్లో ప్రదర్శనలు ఇచ్చి పేరు తెచ్చుకున్నారు. ఆ కూచిపూడి గ్రామాన్ని UNESCO వరల్డ్‌ హెరిటేజ్‌గా తీర్చిదిద్దాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ ప్రయత్నిస్తు్న్నారు. తాజాగా లోక్‌సభ సమావేశాల్లో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. కళల వారసత్వాన్ని భారతదేశంలో నిలబెట్టేలా కూచిపూడిని అభివృద్ధి చేయాలని కోరారు. దీనికోసం కేంద్రం ఆర్థికంగా సహకరించాలని పురంధేశ్వరి కోరారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ప్రతిపాదనను లోక్‌సభ చర్చకు స్వీకరించింది.
Andhra Pradesh
Lok Sabha
Daggubati purandeswari
Kuchipudi
ఆంధ్రప్రదేశ్
లోక్ సభ
దగ్గుబాటి పురందేశ్వరి
కూచిపూడి
Scroll for the next article