News26th Sep 01:05 PMSunil Byrisetty1 min read

జాతికి మార్గదర్శి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్

భారతదేశానికి “ఏకాత్మ మానవవాదం” అనే విలువైన సిద్ధాంతాన్ని అందించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 109వ జయంతి సందర్భంగా కర్నూలులో ఘనంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని బీజేపి జాతీయ కౌన

జాతికి మార్గదర్శి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్
భారతదేశానికి “ఏకాత్మ మానవవాదం” అనే విలువైన సిద్ధాంతాన్ని అందించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 109వ జయంతి సందర్భంగా కర్నూలులో ఘనంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని బీజేపి జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సేవలు, ఆలోచనలు నేటి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. ఆయన సిద్ధాంతాలు, సమాజంలోని చివరి పేద కుటుంబాల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, స్వదేశీ భావన, సమగ్రాభివృద్ధికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆయన జీవన తత్వం నేటి భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆలోచనల ఆధారంగా ముందుకు సాగుతున్నాయని కొనియాడారు. నిజమైన అభివృద్ధి, నిజాయితీ పాలనను బీజేపీ సాధించిన విజయాలు ఆయన ప్రేరణకు నిదర్శనమని తెలిపారు. దేశ ప్రధాని అనేక సందర్భాల్లో ఆయన ఆలోచనలను ప్రస్తావించడం, వారి గొప్పతనాన్ని మనందరికీ మరింత స్పష్టంగా తెలియజేస్తుందని విష్ణు అన్నారు.
Indian Politics
Pandit Deendayal Upadhyaya
109th Birth Anniversary
BJP
Kurnool
Ekta Manavvad
Rural Development
Swadeshi Spirit
ప్రేరణాత్మక నేత
మంచి పాలన
అభివృద్ధి కార్యక్రమాలు
Scroll for the next article