News24th Oct 09:26 AMSunil Byrisetty1 min read
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు 25 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్టు
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
మంటలు చెలరేగి వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు
25 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. బస్సులో 42 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులు సమాచారం. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ సహా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.