International6th Nov 02:53 PMSunil Byrisetty1 min read
కువైట్ లో చిత్రీకరణపై నిషేధం
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ఫోటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం, లైవ్ ప్రసారాలు చేయడంపై అధికారులు నిషేధం విధించారు. ఈ మేరకు సివిల్ ఏవియేషన్
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ఫోటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం, లైవ్ ప్రసారాలు చేయడంపై అధికారులు నిషేధం విధించారు. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ సాద్ అల్ ఉతైబీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులతో పాటు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, వివిధ సంస్థల సిబ్బందికి కూడా వర్తిస్తుంది. మొబైల్ ఫోన్లు, కెమెరాలు లేదా ఇతర సాంకేతిక పరికరాలతో ఫొటోలు, వీడియోలు తీయడం, రికార్డు చేయడం, లైవ్ ప్రసారాలు నిర్వహించడం నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయంలోని రన్‌వేలు, ప్రయాణికుల టెర్మినళ్లు, పరిపాలనా భవనాలు, సాంకేతిక విభాగాలు సహా సివిల్ ఏవియేషన్ అథారిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.