Spiritual9th Aug 01:36 PMSunil Byrisetty1 min read

దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ఏటీఎం

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ఏటీఎం ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్ లో బుకింగ్ చేస్తే ఏటీఎంలో ప్రసాదం అందుకోవచ్చు. బుక్ చేసుకోగానే ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మిషన్ లో ఎంటర్

దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ఏటీఎం
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ఏటీఎం ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్ లో బుకింగ్ చేస్తే ఏటీఎంలో ప్రసాదం అందుకోవచ్చు. బుక్ చేసుకోగానే ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మిషన్ లో ఎంటర్ చేస్తే లడ్డూలు భక్తుల చేతిలోకి వస్తాయి. ఒకటి నుండి ఆరు లడ్డుల వరకు మిషన్ లో పొందవచ్చు. దసరా నవరాత్రుల కల్లా మొదలు పెట్టాలని దుర్గగుడి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆలయంలో 6 మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలలో సుమారు 30 లక్షల నుండి 35 లక్షల లడ్డులు ప్రతి సంవత్సరం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ డిమాండ్ దృష్ట్యా ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
Andhra Pradesh
Vijayawada Durga Temple
Laddu ATM
Kanaka Durga Temple
Prasadam
Dasara Navaratri
Vijayawada
ఆలయ వార్తలు
భక్తి వార్తలు
ఆన్‌లైన్ బుకింగ్
ఓటీపీ
ఆంధ్రప్రదేశ్
ఆధ్యాత్మిక పర్యాటకం
Scroll for the next article