Spiritual23rd Sep 12:26 PMSunil Byrisetty1 min read

దుర్గమ్మ భక్తుల కోసం ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'లడ్డూ ప్రసాదం ఏటీఎం'

దుర్గమ్మ భక్తుల కోసం ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'లడ్డూ ప్రసాదం ఏటీఎం' (స్వయంచాలక లడ్డూ విక్రయ యంత్రం)ను దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్,దుర్గమ్మ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్, సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దుర్గగుడి దేవస్థానంలో ఈ స్వయంచాలక యంత్రాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ​సందర్భంగా రామచంద్ర మోహన్ మాట్లాడుతూ.. దర్శనార్థం విచ్చేసే భక్తులు ప్రసాదం కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే శ్రమ లేకుండా, త్వరితగతిన లడ్డూ ప్రసాదాన్ని పొందేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపి ప్రసాదం పొందేలా ఈ యంత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రయల్ రన్ గా ఏర్పాటు చేసామని,ఈ పైలట్ ప్రాజెక్ట్ పనితీరును పరిశీలించిన అనంతరం, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రధాన ప్రాంతాల్లోనూ మరిన్ని యంత్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.
Scroll for the next article