News12th Aug 12:10 PMSunil Byrisetty1 min read
లేడీ అఘోరీకి బెయిల్.. షరతులివే!
మంగళగిరి యువతిని పెళ్లి చేసుకుని పారిపోయిన అఘోరీ శ్రీనివాస్ గుర్తుండే ఉంటాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆ లేడీ అఘోరీ శ్రీనివాస్‌కు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.
మంగళగిరి యువతిని పెళ్లి చేసుకుని పారిపోయిన అఘోరీ శ్రీనివాస్ గుర్తుండే ఉంటాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆ లేడీ అఘోరీ శ్రీనివాస్‌కు సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 వేల జరిమానాతో సహా షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. దాంతోపాటు ప్రతి గురువారం కొత్తపల్లి పీఎస్‌లో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో అఘోరీ శ్రీనివాస్ మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నాడు. కరీంనగర కొత్తపల్లికి చెందిన ఓ యువతి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని కేసు పెట్టిన విషయం తెలిసిందే.