News26th Mar 08:25 AMSunil Byrisetty1 min read
మంగళగిరిలో అ’ఘోరం‘
మంగళగిరిలో నకిలీ అఘోరీ కొంప ముంచాడు. ఆడ అఘోరీగా చెప్పుకొంటూ ఒక కుటుంబం పంచన చేరి, ఏకంగా ఆ ఇంట్లో యువతిని తీసుకుని జంపయ్యాడు. అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొంతకాలంగా లే
మంగళగిరిలో నకిలీ అఘోరీ కొంప ముంచాడు. ఆడ అఘోరీగా చెప్పుకొంటూ ఒక కుటుంబం పంచన చేరి, ఏకంగా ఆ ఇంట్లో యువతిని తీసుకుని జంపయ్యాడు.
అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్నాడు.
తన కూతురికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న తన కుమార్తె. నాలుగు నెలల క్రితం మంగళగిరి నేషనల్ హైవే మీద లేడీ అఘోరి బట్టలు లేకుండా హల్చల్ చేస్తుండటాన్ని చూసింది. అదే సమయంలో పోలీసులు ఎవరైనా మహిళలు ఉంటే ఆ లేడి అఘోరికి బట్టలు కప్పాలని కోరారు. మానవత్వంతో స్పందించిన తమ కుమార్తె ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పిందని తండ్రి వివరించారు.
అప్పటినుంచి తన కూతురు ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడుతుందని చెప్పారు.
కొంతకాలం గడిచిన తర్వాత ఇంటికి కూడా వచ్చి తన కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి ఆకుపసరుతో లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తారని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడని వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.