News17th Mar 12:07 PMSunil Byrisetty1 min read
ఏం జరిగితే మాకేంటి.. వీఐపీల సేవ చాలు
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరునాళ్ళకు వచ్చే భక్తులకు తప్పని ఇక్కట్లు... పోలీసు బందోబస్తు కేవలం వీఐపీలకేనా అని భక్తులు ప్రశ్ని్స్తున్నారు. బందోబస్త
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరునాళ్ళకు వచ్చే భక్తులకు తప్పని ఇక్కట్లు... పోలీసు బందోబస్తు కేవలం వీఐపీలకేనా అని భక్తులు ప్రశ్ని్స్తున్నారు.
బందోబస్తు ఏర్పాట్లలో మంగళగిరి పట్టణ పోలీసుల నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తుంది.
దేవస్థానం రోడ్డులో కార్లకు ఎలా అనుమతి ఇచ్చారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే విషయం తెలియదా అని నిలదీస్తున్నారు.
ప్రముఖులు వచ్చినప్పుడే కాదు భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని బందోబస్తు ఏర్పాటు చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే మాదిరిగా పోలీసు తీరు ఉంటే అక్కడ జరిగే దొంగతనాలకు, వివాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నారు.
భక్తుల పట్ల శ్రద్ధ ఇదేనా అని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.