Politics9th Jul 05:40 PMSunil Byrisetty1 min read
కూటమి పాలనలో ఏపీ అంధకారం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నడుస్తోంది రాజ్యాంగబద్ధమైన 'రూల్ ఆఫ్ లా' కాదని.. చంద్రబాబు, లోకేష్‌లు రుద్దిన 'రూల్ ఆఫ్ ఫియర్' అని వైసీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్త
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నడుస్తోంది రాజ్యాంగబద్ధమైన 'రూల్ ఆఫ్ లా' కాదని.. చంద్రబాబు, లోకేష్‌లు రుద్దిన 'రూల్ ఆఫ్ ఫియర్' అని వైసీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ చేతగానితనం వల్ల రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్‌గా మారిందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల స్వర్ణయుగ పాలనలో విద్యా, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం సాధించిన కేంద్ర అవార్డులను గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ తెచ్చిన 'రెడ్ బుక్ రాజ్యాంగం'తో అక్రమ కేసులు, లాకప్ డెత్‌లు పెరిగిపోయాయని ఆరోపించారు. వైయస్.జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేట్ పరం చేస్తూ కమీషన్ల దందాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో 'మౌన విప్లవం' మొదలైందని, త్వరలోనే ఈ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు.