News24th Apr 12:25 PMSunil Byrisetty1 min read
ఉత్తమ మహిళా సర్పంచ్‌గా శ్రీకాకుళం మహిళ
సిక్కోలు సర్పంచ్ లక్ష్మీ రమణమూర్తి ఢిల్లీలో "సర్పంచ్ సంవాద్ స్టార్ మహిళ" గా అవార్డు గెలుచుకున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడ సర్పంచ్ రుప్ప లక్ష్మీ రమణమూర్తికి అరుదైన గౌరవం
సిక్కోలు సర్పంచ్ లక్ష్మీ రమణమూర్తి ఢిల్లీలో "సర్పంచ్ సంవాద్ స్టార్ మహిళ" గా అవార్డు గెలుచుకున్నారు.
శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడ సర్పంచ్ రుప్ప లక్ష్మీ రమణమూర్తికి అరుదైన గౌరవం దక్కింది.
ఢిల్లీ వేదికగా సర్పంచ్ సంవాద్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె పిలుపు అందుకున్నారు.
స్వచ్ భారత్, జలజీవన్ మిషన్, సమావేశాలు నిర్వహణను గుర్తిస్తూ నిర్వాహకులు బుధవారం సర్పంచ్ సంవాద్ స్టార్ మహిళ అవార్డును ప్రధానం చేశారు.
దేశవ్యాప్తంగా గ్రామ అభివృద్ధిలో ప్రతిభకనబర్చిన సర్పంచులతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించింది.