Business Type8th Jun 12:41 PMSunil Byrisetty1 min read
డబ్బులు ఊరికే రావు.. ఐపీవో దిశగా లలితా జువెలరీ!
డబ్బులు ఊరికే రావు.. ఈ యాడ్ గుర్తుండే ఉంటుంది. ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జువెలరీ మార్ట్ అధినేత కిరణ్ స్వయంగా ఈ ప్రకటనలో ఆ డైలాగ్ చెబుతారు. ఇప్పుడు లలితా జువెలరీ పబ్లిక్ ఇష్య
డబ్బులు ఊరికే రావు.. ఈ యాడ్ గుర్తుండే ఉంటుంది. ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జువెలరీ మార్ట్ అధినేత కిరణ్ స్వయంగా ఈ ప్రకటనలో ఆ డైలాగ్ చెబుతారు. ఇప్పుడు లలితా జువెలరీ పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) వచ్చేందుకు సిద్ధమవుతోంది. సుమారు రూ.1700 కోట్లు ఐపీవోతో సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. సమీకరించాలనుకుంటున్న మొత్తంలో రూ.1200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయాలని లలితా జువెలరీ సెబీకి ప్రతిపాదించింది. అదనంగా సంస్థ ప్రమోటర్ అయిన కిరణ్ కుమార్ జైన్ తన వాటా నుంచి రూ.500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లలితా జువెలరీకి దక్షిణ భారతదేశంలో 56 రిటైల్ విక్రయశాలలు ఉన్నాయి. 2022-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఏటా సగటున 43.62 శాతం వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధులను వ్యాపార విస్తరణకు ఉపయోగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్తగా 12 స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.