News22nd Aug 12:56 PMSunil Byrisetty1 min read
థీమ్ బేస్డ్ పట్టణాల నిర్మాణానికి భూసేకరణ
ఏపీలో థీమ్ బేస్డ్ పట్టణాల నిర్మాణానికి భూసేకరణ ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నగరాల చుట్టూ కొత్త థీమ్ బేస్డ్ పట్టణాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింద
ఏపీలో థీమ్ బేస్డ్ పట్టణాల నిర్మాణానికి భూసేకరణ ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నగరాల చుట్టూ కొత్త థీమ్ బేస్డ్ పట్టణాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకోసం విశాఖలో 1,000 ఎకరాలు, మిగతా 12 నగరాల్లో 1,500 ఎకరాలను గుర్తించారు. మొదటి దశలో విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, కర్నూలులో అభివృద్ధి జరగనుంది. వీటిలో ఐటీ, పర్యాటకం, పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు భూములు కేటాయించనున్నారు. మలిదశలో ఇతర నగరాల్లో భూసేకరణ చేపట్టనున్నారు.