News30th Aug 12:21 PMSunil Byrisetty1 min read

మంగళగిరి ఎయిమ్స్ కు భూ కేటాయింపు

మంగళగిరి ఎయిమ్స్ భూమిని హైవే కోసం కేటాయించింది. ఎయిమ్స్ పరిధిలోని 3.34 ఎకరాల భూమిని NH-16తో అనుసంధానించే E-13 రోడ్డు ఎక్స్టెన్షన్ కారిడార్ నిర్మాణం కోసం కేటాయించేందుకు కేంద్రం ఆమోద

మంగళగిరి ఎయిమ్స్ కు భూ కేటాయింపు
మంగళగిరి ఎయిమ్స్ భూమిని హైవే కోసం కేటాయించింది. ఎయిమ్స్ పరిధిలోని 3.34 ఎకరాల భూమిని NH-16తో అనుసంధానించే E-13 రోడ్డు ఎక్స్టెన్షన్ కారిడార్ నిర్మాణం కోసం కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా 10 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం ద్వారా ఎయిమ్స్ మంగళగిరికి త్వరగా అప్పగించే ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 10 ఎకరాల భూమి అప్పగింత పూర్తయిన అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందించాలని పేర్కొంది.ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ... E-13 రోడ్‌ను NH-16తో అనుసంధానించే ఈ కీలక ప్రాజెక్టుకు అవసరమైన భూ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఈ అనుసంధాన రహదారి పూర్తయితే మంగళగిరి–గుంటూరు ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడి, ప్రజలకు వేగవంతమైన రాకపోకలు, మెరుగైన రహదారి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని డా. పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Andhra Pradesh
Mangalagiri AIIMS
AIIMS Mangalagiri
Mangalagiri
Guntur
E-13 Road
NH-16
Highway Connectivity
Road Infrastructure
Land Allocation
కేంద్ర ప్రభుత్వం
పెమ్మసాని చంద్రశేఖర్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
మౌలిక వసతుల అభివృద్ధి
మంగళగిరి
Scroll for the next article