News14th Aug 11:37 AMSunil Byrisetty1 min read
రిజిస్ట్రేషన్ చేసిన గంటలోనే ఆస్తి పత్రాలు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలో వినూత్న మార్పులు చేస్తోంది. ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలో వినూత్న మార్పులు చేస్తోంది. ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (IGRS) ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన గంటలోపు పత్రాలు అందిస్తున్నారు. అలాగే IGRS పోర్టల్ ద్వారా సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందస్తు స్లాట్ బుక్ చేసిన వారు సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC) , రిజిస్టర్డ్ డీడ్ వంటి పత్రాలు జారీ చేస్తారు. ఇప్పటికే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ స్లాట్ బుకింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు.
రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర రెవెన్యూ డేటాబేస్‌తో అనుసంధానం చేశారు. ఆధార్ ఆధారిత ఈ-కెవైసీ, డిజిటల్ సంతకాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దీంతో గంటలోపు పత్రాలు అందుతున్నాయి.