News2nd Jan 02:18 PMSunil Byrisetty1 min read
గత ఐదేళ్లలో భూ రికార్డులు చిందరవందర!
రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండకూడదని, ప్రభుత్వ అధికారిక చిహ్నమైన 'రాజముద్ర'తోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని స్పీకర్ చింతకాయల అయ్
రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండకూడదని, ప్రభుత్వ అధికారిక చిహ్నమైన 'రాజముద్ర'తోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాలు ముద్రించి రైతులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. తాతల తండ్రుల నాటి నుంచి వస్తున్న రైతుల భూములకు, పాలకుల ఫొటోలు ముద్రించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ, కూటమి ప్రభుత్వం కేవలం 'రాజముద్ర'తో కూడిన పుస్తకాలను తీసుకువచ్చిందని తెలిపారు. కొత్తగా ఇస్తున్న పాస్ పుస్తకాలలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించామని తెలిపారు. ప్రతి పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ కోడ్ స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయని వివరించారు.