News26th Sep 04:46 PMSunil Byrisetty1 min read

ఘాట్ రోడ్డులో కొండచరియలు.. రక్షణ చర్యల అధ్యయనం

భారీ వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. దేవస్థాన అధికారులు ఇం

ఘాట్ రోడ్డులో కొండచరియలు.. రక్షణ చర్యల అధ్యయనం
భారీ వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. దేవస్థాన అధికారులు ఇంజినీరింగ్ సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి ఆయన ఘాట్ రోడ్డులోని ప్రభావిత ప్రాంతాన్ని, రక్షణ గోడలను, కొండ వాలు భాగాలను నిశితంగా తనిఖీ చేశారు. రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ భక్తుల రక్షణే అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా పటిష్టమైన శాశ్వత ప్రత్యామ్నాయ రక్షణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ అధ్యయనం ఆధారంగా కార్యాచరణ రూపొందించనున్నారు. గతంలో ఇంద్రకీలాద్రి కొండచరియల స్థిరత్వంపై బెంగళూరుకు చెందిన ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తలు సమగ్ర అధ్యయనం చేసి సమర్పించిన సాంకేతిక నివేదిక ఆధారంగా చేపట్టవలసిన రక్షణ పనులపై ఘటనా స్థలంలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Scroll for the next article