Electronics22nd May 05:43 PMSunil Byrisetty1 min read

రూ. 20 వేలకే అదిరిపోయే ల్యాప్ టాప్!

తక్కువ ధరలో మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? రీఫర్బిష్డ్ లెనోవా థింక్‌ప్యాడ్ మోడల్ ఇప్పుడు రూ. 20 వేల ధరలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ టెక్ ఎక్స్‌పర్ట్స్, స్టూడెంట్స్ కోసం అందుబాటుల

రూ. 20 వేలకే అదిరిపోయే ల్యాప్ టాప్!
తక్కువ ధరలో మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? రీఫర్బిష్డ్ లెనోవా థింక్‌ప్యాడ్ మోడల్ ఇప్పుడు రూ. 20 వేల ధరలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ టెక్ ఎక్స్‌పర్ట్స్, స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉంది. ఎడ్యుకేషన్, బిజినెస్ లేదా ఎంటర్‌టైన్మెంట్ కోసం ఈ లెనోవా థింక్‌ప్యాడ్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయొచ్చు. లెనోవా థింక్‌ప్యాడ్ డీల్: 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీతో లెనోవో థింక్‌ప్యాడ్ 6వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ల్యాప్‌టాప్ ధర ఇప్పుడు కేవలం రూ. 19,399కు అందుబాటులో ఉంది. అంతేకాకుండా, కొన్ని బ్యాంక్ కార్డులతో వినియోగదారులు అదనంగా రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్ ఆఫర్లలో ఇదొకటిగా చెప్పొచ్చు. స్పెసిఫికేషన్లు: ఈ లెనోవా ల్యాప్‌టాప్ 2.3GHz బేస్ స్పీడ్, 2.8GHz వరకు టర్బో బూస్ట్‌తో ఇంటెల్ కోర్ i5 6200U ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. 16GB DDR3 ర్యామ్, 512GB SSD ద్వారా పవర్ అందిస్తుంది. బూటింగ్ టైమ్, మల్టీ టాస్కింగ్ సిల్క్ మాదిరిగా స్మూత్‌గా లైటనింగ్ స్పీడ్ ఉంటుంది. 14-అంగుళాల HD (1366×768) డిస్‌ప్లే, వెబ్‌క్యామ్, ఇంటెల్ HD గ్రాఫిక్స్ 520తో ఈ ఫోన్ సాధారణ వినియోగం, వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం వినియోగించుకోవచ్చు. ప్రీ ఇన్‌స్టాల్ సాఫ్ట్‌వేర్: ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11, MS ఆఫీస్ ట్రయల్‌తో ప్రీ లోడ్ అయ్యాయి. USB పోర్ట్‌లు, HDMI, LAN పోర్ట్, బ్లూటూత్‌తో సహా అనేక కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది. 1.5 కిలోల లైట్ వెయిట్, కాంపాక్ట్ సైజు ల్యాప్‌టాప్‌ను ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. నిపుణులు, విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
Laptop Under 20K
Lenovo ThinkPad laptop
budget-friendly price
ThinkPad X1 Carbon
లెనోవా థింక్‌ప్యాడ్ డీల్
ల్యాప్‌టాప్ విండోస్ 11
Scroll for the next article