Spiritual16th Jan 01:52 PMSunil Byrisetty1 min read

దుర్గ గుడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడం, శుక్రవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్

దుర్గ గుడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడం, శుక్రవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం చేపట్టిన చర్యలు చేపట్టింది. పండుగ ముగిసిన తర్వాతి రోజు శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తుల రాక క్రమంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బోర్రా రాధాకృష్ణ (గాంధీ) క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతరాలయం వద్ద ఉన్న క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ లైన్లను క్రమబద్ధీకరించారు.
Andhra Pradesh
Vijayawada
Indrakeeladri
Kanaka Durga Temple
Devotees
Sankranti Festival
Temple Arrangements
Queue Management
క్యూ లైన్
భక్త సౌకర్యం
ధర్మకర్తల మండలి
బోర్రా రాధాకృష్ణ
Scroll for the next article