Farmers18th Aug 05:35 PMSunil Byrisetty1 min read
అన్నదాత సుఖీభవ ఫిర్యాదుల స్వీకరణకు ఆఖరి తేదీ ఆగస్టు 20
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే “అన్నదాత సుఖీభవ పథకం “ లబ్ది పొందుటకు అర్హత ఉండి కూడా లబ్ధి పొందని రైతులు ఈ నెల 20లోగా ఆయా రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవస
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే “అన్నదాత సుఖీభవ పథకం “ లబ్ది పొందుటకు అర్హత ఉండి కూడా లబ్ధి పొందని రైతులు ఈ నెల 20లోగా ఆయా రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.యమ్.ఎఫ్ విజయకుమారి తెలిపారు. ఇంతకు ముందు పరిశీలన లేదా ధృవీకరణలో తిరస్కరించబడిన దరఖాస్తుదారులు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కేవైసీ చేసుకోని కారణంగా తిరస్కరణకు గురైన రైతులు ఆయా రైతు సేవా కేంద్రాల్లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని చెప్పారు. కాగా గత నెల 27 వరకు స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, అర్హులను గుర్తించి నిధులు జమ చేసినట్లు వెల్లడించారు. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరారు.