Politics14th Jul 10:32 AMSunil Byrisetty1 min read

నేటితో ఎన్యూమరేషన్ కు ఆఖరు ‘సర్’

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో కీలక గడువు ముగుస్తోంది. నేటితో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వివరాలు నింపిన ఎన్యూమరేషన్‌ పత్రాలను బీఎల్‌వోలకు సమర్పించడానికి ముగియనుంది. అయిత

నేటితో ఎన్యూమరేషన్ కు ఆఖరు ‘సర్’
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో కీలక గడువు ముగుస్తోంది. నేటితో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వివరాలు నింపిన ఎన్యూమరేషన్‌ పత్రాలను బీఎల్‌వోలకు సమర్పించడానికి ముగియనుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇంకా లక్షలాది పత్రాలు స్వీకరించాల్సి ఉండటంతోపాటు, డిజిటైజేషన్‌ చేయాల్సి ఉంది. అందుకోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 39,81,399 మంది ఓటర్ల ఎన్యూమరేషన్‌ పత్రాలు అన్‌ కలెక్టబుల్‌గా మిగిలాయి. వాటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,16,27,694 మంది ఓటర్లకు 4,09,32,211 మంది ఓటర్ల(98.32 శాతం) ఎన్యూమరేషన్‌ పత్రాలు డిజిటైజ్‌ చేసినట్లు ఈసీ తెలిపింది. అన్‌ కలెక్టబుల్‌ను మినహాయిస్తే 3,69,50,812(88.76 శాతం) ఓటర్ల డిజిటైజేషన్‌ పూర్తయినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాలపై ఆసక్తి నెలకొంది.
Andhra Pradesh
SIR
Special Intensive Revision
Voter List
Enumeration Forms
Election Commission
AP Elections
వివేక్ యాదవ్
ఓటరు నమోదు
ఓటర్ల సవరణ
Scroll for the next article