Sports15th Nov 04:35 PMSunil Byrisetty1 min read

నరాలు తెగే ఉత్కంఠ.. సస్పెన్స్ థ్రిల్లర్!

టార్గెట్ 338.. భారత్ 41.3 ఓవర్లకి 252/8.. ఇక గెలుస్తుందని ఎవరు అనుకుంటారు? కానీ అక్కడి నుంచే అసలు సినిమా మొదలైంది! పాకిస్తాన్‌తో U19 ఆసియా కప్ ఫైనల్.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తా

నరాలు తెగే ఉత్కంఠ.. సస్పెన్స్ థ్రిల్లర్!
టార్గెట్ 338.. భారత్ 41.3 ఓవర్లకి 252/8.. ఇక గెలుస్తుందని ఎవరు అనుకుంటారు? కానీ అక్కడి నుంచే అసలు సినిమా మొదలైంది! పాకిస్తాన్‌తో U19 ఆసియా కప్ ఫైనల్.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో భారత జట్టు కీలక వికెట్లు వరుసగా పడటంతో పరిస్థితి మారిపోయింది. కెప్టెన్ లక్ష్య రైచందాని 70 పరుగులతో పోరాడినా, 38 ఓవర్లకే 226 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఒత్తిడి.. వరుస వికెట్లు! 41.3 ఓవర్లకు 252/8! ఇంకా 51 బంతుల్లో 86 పరుగులు చేయాలి. చేతిలో రెండు వికెట్లు మాత్రమే! మ్యాచ్ పోయిందని చాలామంది టీవీలు ఆపేసి ఉంటారు. పాకిస్తాన్ శిబిరంలో విజయోత్సాహం మొదలై ఉంటుంది. కానీ ఇద్దరు కుర్రాళ్లు మణాల్ చౌహాన్, మోహిత్ ఉల్వా.. పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడి మొదలుపెట్టారు. బౌండరీలు, సిక్సర్లతో అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని కళ్లముందుకు తీసుకొచ్చారు. 47 పరుగులతో మణాల్, 30 పరుగులతో మోహిత్ కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. చివరిలో మళ్లీ వికెట్ పడింది. ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరి బాల్ కి మూడు రన్స్ అవసరం కాగా మోహిత్ ఉల్క్వ ఫోర్ కొట్టి భారత్ కి అద్భుతమైన విజయం అందించారు. చివరి నిమిషం వరకు పోరాడితే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని నిరూపించిన విజయం!
Scroll for the next article