News6th Jan 11:56 AMSunil Byrisetty1 min read
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ కాలండర్ ఆవిష్కరణ
స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ వ్యవస్థలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు పట్టుకొమ్మలుగా నిలవాలని ఆ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. వెలగపూడి సచివాలయంలో
స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ వ్యవస్థలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు పట్టుకొమ్మలుగా నిలవాలని ఆ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీ ఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి డిఎస్ బీవీ స్వామి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ వ్యవస్థలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు పట్టుకొమ్మలుగా నిలవాలన్నారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లా, డివిజన్,మండల, స్ధాయిల్లో మూడంచెల వ్యవస్ధ తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యోగులందరికీ బదిలీలు, పదోన్నతుల కల్పనకు చర్యలు చేపట్టాం. ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.