Mobile2nd Nov 02:28 PMSunil Byrisetty1 min read
లావా నుంచి వస్తున్న బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్..
ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన లావా, తమ కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ Lava Agni 4 5G ని వచ్చే నెలలో అనగా నవంబర్ లో భారత మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది
ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన లావా, తమ కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ Lava Agni 4 5G ని వచ్చే నెలలో అనగా నవంబర్ లో భారత మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ Lava Agni 3 కి అడ్వాన్స్డ్ మోడల్ గా రానుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8340 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15, 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ ధర సుమారు రూ. 25,000 లుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేశీయ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ అయిన లావా, తమ సరికొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Lava Agni 4 5G ని నవంబర్ నెలలో భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ గత ఏడాది విడుదలైన Lava Agni 3 5G స్మార్ట్ ఫోన్ కి అడ్వాన్స్డ్ మోడల్ గా రానుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, అలాగే ధర, అదేవిధంగా విడుదల తేదీని కంపెనీ ప్రకటించపోయినప్పటికీ దీనికి సంబంధించిన ఫీచర్స్ వివిధ ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలో లీక్ అవ్వడం జరిగింది. వీటి ప్రకారం, Lava Agni 4 5G మీడియాటెక్ డైమెన్సిటీ 8340 ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదల కానున్నట్లు తెలుస్తుంది.