Mobiles24th May 02:26 PMSunil Byrisetty1 min read

లావా కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్!

5జి ఫోన్ బడ్జెట్‌లో కావాలంటే గ‌తంలో క‌నీసం రూ.15వేలు వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రూ.10వేల లోపే అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా లావా కంపెనీ నూత‌న బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్‌ను

లావా కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్!
5జి ఫోన్ బడ్జెట్‌లో కావాలంటే గ‌తంలో క‌నీసం రూ.15వేలు వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రూ.10వేల లోపే అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా లావా కంపెనీ నూత‌న బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. షార్క్ 5జి పేరిట లావా విడుద‌ల చేసిన ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను అందిస్తున్నారు. ఈఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసోక్ టి765 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. మ‌రో 4జీబీ వ‌ర‌కు ర్యామ్‌ను వ‌ర్చువ‌ల్‌గా పెంచుకోవచ్చు. క్లీన్ ఆండ్రాయిడ్ 15 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్, స్టైలిష్ గ్లాసీ బ్యాక్ డిజైన్‌ను క‌లిగి ఉంది. స్లీక్ డిజైన్ ఫోన్ కొనాల‌ని చూస్తున్న వారికి ఈ ఫోన్ చ‌క్క‌ని ఆప్ష‌న్. ఇందులో 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ, 10 వాట్ల ఫాస్ట్ చార్జ‌ర్‌ను బాక్స్‌తో స‌హా అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 64జీబీ స్టోరేజ్ ల‌భిస్తుంది. మెమొరీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512 వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. లావా షార్క్ 5జి స్మార్ట్ ఫోన్ స్టెల్లార్ గోల్డ్‌, స్టెల్లార్ బ్లూ వేరియెంట్ల‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధ‌ర‌ను రూ.7,999గా నిర్ణ‌యించారు.
Smart Phones
Android Smart Phone
Lava Shark 5g
లావా కంపెనీ నూత‌న బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్‌
90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌
హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌
Scroll for the next article