Politics11th Apr 04:04 PMSunil Byrisetty1 min read

కేంద్రానికి ఎంపీ లావు లేఖ.. వైసీపీ కుట్రలు చేస్తోందంటూ ఫిర్యాదు!

రాష్ట్రంలో రాజకీయ అలజడి రేపేందుకు జగన్, వైసీపీ కుట్రలు చేస్తున్నాయంటూ టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. మేరకు కేంద్ర హోంశాఖకి లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగా జనాన్ని సమీకర

కేంద్రానికి ఎంపీ లావు లేఖ.. వైసీపీ కుట్రలు చేస్తోందంటూ ఫిర్యాదు!
రాష్ట్రంలో రాజకీయ అలజడి రేపేందుకు జగన్, వైసీపీ కుట్రలు చేస్తున్నాయంటూ టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. మేరకు కేంద్ర హోంశాఖకి లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగా జనాన్ని సమీకరించి హెలికాఫ్టర్లు చుట్టూ మూగేలా చేసుకుని.. రచ్చ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలనూ కేంద్రానికి రాసిన లేఖలో ఎంపీ లావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొత్తం హింస, కుల చిచ్చులతో నిండి ఉంటుందని.. ప్రజలు ఓడించినా ఆయన తన పార్టీ వారిని రెచ్చగొట్టి.. వారిని బలి చేస్తున్నారన్నారు. తాను రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ తన లేఖలో వివరించారు. ఇటీవల జగన్ పర్యటనల్లో ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనలు, వాటి వెనుక పోలీసు దర్యాప్తులో తేలిన నిజాలను ఎంపీ ఆ లేఖకు జత చేసినట్లు చెబుతున్నారు.
Lavu Krishna devarayulu
Letter
వైసీపీ కుట్రలు
జగన్మోహన్ రెడ్డి రాజకీయం
Scroll for the next article