News9th Nov 11:02 AMSunil Byrisetty1 min read

ప్రజా సేవలో నిబద్ధతతో వ్యవహరించాలి

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా పార్టీ నాయకులు సమన్వయం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మం

ప్రజా సేవలో నిబద్ధతతో వ్యవహరించాలి
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా పార్టీ నాయకులు సమన్వయం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లోని పార్టీ కార్యాలయ విభాగాలతో ఆయన నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు. పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల బాధ్యతలపై ముఖ్యమంత్రి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదల సేవలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు కార్యకర్తల బీమా, CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. పార్టీ కార్యకర్తల బీమాకు సంబంధించిన లెటర్లు ఇంకా అందించని వారి వివరాలను సేకరించి తనకు అందజేయాలన్నారు. ప్రజాసేవలో నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు టీడీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Nara Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Public Service
Welfare Programs
NTR Bhavan
Mangalagiri
పింఛన్ పంపిణీ
సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు
పార్టీ సమావేశం
Scroll for the next article