Politics23rd Oct 05:02 PMSunil Byrisetty1 min read
స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
మోదీ, అమిత్షా అండదండలంతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తనకున్న అధికార బలాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఇష్టారాజ్
మోదీ, అమిత్షా అండదండలంతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తనకున్న అధికార బలాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఇష్టారాజ్యంగా దౌర్జన్యకాండ, హింసను సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రజలపై విశ్వాసం లేని కారణంగానే టీడీపీ నాయకత్వం నరేంద్ర మోదీ, అమిత్ షాలపై ఆధారపడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వానికి లొంగిపోయినప్పటి నుంచి టీడీపీ తన స్వతంత్ర రాజకీయ వైఖరిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీని ‘మోషా దేశం’గా అభివర్ణిస్తూ, ప్రజా సమస్యల కంటే అధికారాన్ని, డబ్బునే ఆ పార్టీ ప్రాధాన్యంగా భావిస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు పరస్పర అవగాహనతో, రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల సర్దుబాటు చేసుకున్న ప్రాంతాల్లో ఉమ్మడిగా అభ్యర్థులకు మద్దతు ఇస్తాయని, దీంతో సీపీఐ, సీపీఎం, ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులను స్థానిక సంస్థలకు ఎన్నుకోవడం ద్వారా ప్రజలకు ప్రత్యామ్నాయ పాలన అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.