News23rd Jun 12:39 PMSunil Byrisetty1 min read
ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండిస్తూ వామపక్షాలు నిరసన
ఇరాన్‌పై అమెరికా బాంబు దాడులు చేయడాన్ని నిరసిస్తూ మంగళగిరిలో సిపిఐ సిపిఎం, సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి, మానవహారం చేశారు. వామపక్షాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా
ఇరాన్‌పై అమెరికా బాంబు దాడులు చేయడాన్ని నిరసిస్తూ మంగళగిరిలో సిపిఐ సిపిఎం, సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి, మానవహారం చేశారు. వామపక్షాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ దాడులను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్ అనుకూల వైఖరిని అమెరికా విడనాడాలని కోరారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచడమే కాకుండా పశ్చిమ ఆసియా అస్థిరతకు దారి తీసే విధంగా అమెరికా సైనిక చర్యలు ఉన్నాయని అన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రపంచ మేధావులు పూనుకోవాలని కోరారు.