News5th Aug 12:25 PMSunil Byrisetty1 min read
విద్యుత్ చార్జీలపై వామపక్షాల ధర్నా
విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గుడివాడ ఏలూరు రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ముందు వామపక్షాల నాయకులు ధర్నా చేపట్టార
విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గుడివాడ ఏలూరు రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ముందు వామపక్షాల నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. విద్యుత్ ట్రూ అప్ చార్జీలు, మరియు సర్దుబాటు చార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ సి పి రెడ్డి డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ సిపిఐ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకుడు పంతగాని సురేష్, ఐద్వా కార్యదర్శి రజిని, ఏఐటీయూసీ నాయకుడు చింతలూరు సత్యనారాయణ, పలువురు వామపక్షాల పార్టీల నాయకులు పాల్గొన్నారు.