Politics21st Oct 04:38 PMSunil Byrisetty1 min read

వ్యయ పరిమితి దాటితే చట్టపరమైన చర్యలు తప్పవు

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితులను కచ్చితంగా పాటించాలని జిల్లా వ్యయ పరిశీలకులు ఎం.శివ ప్రసాద్ స్పష్టం చేశారు. విజయవాడ

వ్యయ పరిమితి దాటితే చట్టపరమైన చర్యలు తప్పవు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితులను కచ్చితంగా పాటించాలని జిల్లా వ్యయ పరిశీలకులు ఎం.శివ ప్రసాద్ స్పష్టం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థికి గరిష్ఠంగా రూ. 25 లక్షలు, కార్పొరేటర్ (వార్డు సభ్యుల) అభ్యర్థులకు రూ.10 లక్షలు. మున్సిపాలిటీలు నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, కొండపల్లి చైర్‌పర్సన్ అభ్యర్థికి రూ. 20 లక్షలు, వార్డు సభ్యులకు రూ.7.50 లక్షలు. నగర పంచాయతీలు చైర్‌పర్సన్ అభ్యర్థికి రూ. 10 లక్షలు, వార్డు సభ్యులకు రూ. 5 లక్షలు వ్యయ పరిమితులు ఉన్నాయని వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955లోని సెక్షన్ 617-బి(1), ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నామినేషన్ వేసిన నాటి నుంచి తుది ఫలితాలు వచ్చే వరకు ప్రతిరోజూ ఖర్చులను సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. వాహనాలు, ర్యాలీలు, మైకులు, ప్రచార సామగ్రి, వార్తాపత్రిక ప్రకటనలు తదితర వ్యయాలను పొందుపరచాలన్నారు. అభ్యర్థి మాత్రమే కాకుండా ఎన్నికల ఏజెంట్, పార్టీ లేదా ఇతరులు అభ్యర్థి తరఫున చేసిన ఖర్చులన్నీ అభ్యర్థి ఖాతాలోనే చేర్చబడతాయని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యయ పరిమితులను ఉల్లంఘించినా లేదా నిర్దేశిత గడువులోగా తుది వ్యయ లెక్కలను సమర్పించకపోయినా అభ్యర్థులపై చట్టప్రకారం మూడేళ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు వేయడం జరుగుతుందని హెచ్చరించారు.
Scroll for the next article