Entertainment20th Nov 03:42 PMSunil Byrisetty1 min read

రాజమౌళికి చిక్కులు.. వరుస కేసులు

ప్రముఖ సినీ దర్శకుడు SS రాజమౌళిపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ మొత్తం 3 కేసులు ఫైలయ్యాయి. వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చోని కనిపించగా.. హిందువులు ఎంతో పవ

రాజమౌళికి చిక్కులు.. వరుస కేసులు
ప్రముఖ సినీ దర్శకుడు SS రాజమౌళిపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ మొత్తం 3 కేసులు ఫైలయ్యాయి. వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చోని కనిపించగా.. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టాడని ఒక కేసు నమోదైంది. వారణాసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడంటూ రాష్ట్రీయ వానర సేన సంఘం మరో కేసు పెట్టింది. బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాడంటూ మరో కేసు నమోదైంది. దీంతో ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై రాజమౌళి ఇంకా స్పందించలేదు.
Tollywood
SS Rajamouli
Legal Cases
Varanasi Trailer
Mahesh Babu
Nandi Controversy
Hanuman Remarks Issue
Baahubali The Eternal War
Film Controversy
Indian Cinema
Scroll for the next article