News24th Nov 04:37 PMSunil Byrisetty1 min read

దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర(89) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం.. సోమవారం విషమించడంతో కన్నుమూశారు. అక్టోబరు 31న ధర్మేంద్ర అనారోగ్యం పాల

దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర(89) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం.. సోమవారం విషమించడంతో కన్నుమూశారు. అక్టోబరు 31న ధర్మేంద్ర అనారోగ్యం పాలవగా, ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. రొటీన్ చెకప్ కోసమని ఆస్పత్రికి తీసుకెళ్లామని ఆయన కుటుంబం తెలిపారు. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హేమ మాలిని, సన్నీ దేవోల్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ఈ క్రమంలో సోమవారం ధర్మేంద్ర ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు. ధర్మేంద్ర మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 'భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది. తన నటనతో అనేక పాత్రలకు వన్నె తెచ్చారు. ఇది ఎంతో విచారకరమైన సమయం. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చిత్ర పరిశ్రమకు తీరని లోటు ' అని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
Indian Cinema
Dharmendra
Bollywood
Death
Hema Malini
Sunny Deol
Hindi Film Industry
Breach Candy Hospital
ప్రధాని మోదీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
చంద్రబాబు
సినీ ప్రముఖులు
Scroll for the next article