Electronics23rd May 01:12 PMSunil Byrisetty1 min read
ఈ ల్యాప్‌టాప్ వేడెక్కదు.. లెనోవో ఆవిష్కరణ!
దిగ్గజ టెక్నాలజీ సంస్థ లెనోవో, గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త ఆవిష్కరణను తీసుకువచ్చింది. 'లెనోవో లీజియన్ 9ఐ' పేరుతో శక్తిమంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. గేమింగ్‌లో కొత
దిగ్గజ టెక్నాలజీ సంస్థ లెనోవో, గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త ఆవిష్కరణను తీసుకువచ్చింది.
'లెనోవో లీజియన్ 9ఐ' పేరుతో శక్తిమంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది.
గేమింగ్‌లో కొత్త అనుభూతిని అందించడంతోపాటు ఎంత ఆడినా వేడెక్కకపోవడం విశేషం.
ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. డీడీఆర్5 ర్యామ్, పీసీఐఈ జెన్ 5 ఎస్‌ఎస్‌డీని అమర్చారు.
వినియోగదారులు గరిష్టంగా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5090 ల్యాప్‌టాప్ జీపీయూ వరకు కాన్ఫిగర్ చేసుకోవచ్చు.
ప్రాసెసర్, జీపీయూ కలిసి మొత్తం 280W పవర్‌ను అందించగలవని కంపెనీ తెలిపింది.
దీంతో అత్యంత భారీ గ్రాఫిక్స్ కలిగిన గేమ్‌లను కూడా సులభంగా ఆడవచ్చు. 18 అంగుళాల ప్యూర్‌సైట్ స్క్రీన్‌తో 240Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను తగ్గించడానికి 'లెజియన్ కోల్డ్‌ఫ్రంట్ వేపర్' థర్మల్ సిస్టమ్‌ను అమర్చారు. వై-ఫై కార్డ్, ఎస్‌ఎస్‌డీ, ర్యామ్ కోసం ప్రత్యేక ఫ్యాన్‌లు ఉన్నాయని, గ్రాఫికల్‌గా డిమాండ్ ఉన్న పనుల సమయంలో కూడా వేడిని సమర్థవంతంగా అదుపు చేస్తుందని లెనోవో పేర్కొంది.
280W పర్ఫార్మెన్స్ మోడ్‌లో కూడా ల్యాప్‌టాప్ 48dB కంటే తక్కువ శబ్దం చేస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది.
ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 275HX ప్రాసెసర్‌తో పాటు, గరిష్టంగా 64GB డ్యూయల్ ఛానల్ డీడీఆర్5 ర్యామ్, 2TB వరకు పీసీఐఈ జెన్5 ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌తో వస్తుంది. అవసరమైతే ర్యామ్‌ను 192GB వరకు, స్టోరేజ్‌ను 8GB వరకు విస్తరించుకునే సౌలభ్యం ఉంది.
ఇది విండోస్ 11 ప్రో వరకు ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.
ధర విషయానికొస్తే, 9ఐ ప్రారంభ ధర 4,499 యూరోలు (సుమారు రూ. 4,32,000)గా నిర్ణయించారు.
కార్బన్ బ్లాక్ కలర్‌వేలో లభిస్తుంది.