News14th Oct 11:45 AMSunil Byrisetty1 min read

హౌస్‌లో పరిణామాలపై గవర్నర్ కు ఫిర్యాదు

హౌస్‌లో కూట‌మి స‌భ్యులు అవమానకరంగా ప్రవర్తించారని, క‌క్ష‌సాధింపు రాజ‌కీయాల‌పై గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన‌ మండ‌లి డిప్యూటీ స్పీక‌ర్ మాధ‌వ‌రావు వివరించారు. ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న త‌న‌ను చ

హౌస్‌లో పరిణామాలపై గవర్నర్ కు ఫిర్యాదు
హౌస్‌లో కూట‌మి స‌భ్యులు అవమానకరంగా ప్రవర్తించారని, క‌క్ష‌సాధింపు రాజ‌కీయాల‌పై గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన‌ మండ‌లి డిప్యూటీ స్పీక‌ర్ మాధ‌వ‌రావు వివరించారు. ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న త‌న‌ను చైర్మ‌న్ చైర్‌లో కూర్చోబెట్టే ముందు కూట‌మి స‌భ్యులు బయటకి వెళ్లిపోయారన్నారు. దేశం చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి క‌క్ష‌సాధింపు రాజ‌కీయాలు చూడ‌లేదని వ్యాఖ్యానించారు. పీఎస్.. అడిషన్ పీఎస్, సిబ్బంది ప్రోటోకాల్ ఇవ్వలేదు.. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. డిప్యూటీ స్పీకర్‌కి కేబినెట్ హోదా ఇచ్చారు.. డిప్యూటీ చైర్మన్‌కి ఇవ్వ‌కుండా కుట్ర చేస్తున్నారని వివరించారు. సెక్రటరీ జనరల్, ప్రభుత్వం ఇద్దరూ గేమ్ ఆడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రోటోకల్ వ్యవస్థలో డిప్యూటీ చైర్మన్ ని అవమాన పరచాలని చూస్తున్నారని తెలిపారు.
Scroll for the next article