Electronics25th May 12:47 PMSunil Byrisetty1 min read
సోలార్ ల్యాప్ టాప్.. లెనోవో ఆవిష్కరణ!
ప్రముఖ ల్యాప్ టాప్ తయారీ సంస్త లెనోవో సూర్యకాంతితో పని చేసే గ్యాడ్జెట్ ను తీసుకొచ్చింది. Yoga Solar PC Concept (POC)- Sunlight powered PC సూర్యకాంతితో నడిచే ల్యాప్‌టాప్. లెనోవో ఈ ప
ప్రముఖ ల్యాప్ టాప్ తయారీ సంస్త లెనోవో సూర్యకాంతితో పని చేసే గ్యాడ్జెట్ ను తీసుకొచ్చింది.
Yoga Solar PC Concept (POC)- Sunlight powered PC సూర్యకాంతితో నడిచే ల్యాప్‌టాప్.
లెనోవో ఈ పీసీని ప్రత్యేకంగా ఇండోర్ ప్రదేశాల్లోనే కాకుండా బయట పని చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్‌గా రూపొందించింది.
లెనోవో ప్రదర్శించిన ఈ యోగా సోలార్ పీసీ చూడ్డానికి రెగ్యులర్ ల్యాప్‌ట్యాప్‌లానే ఉంటుంది.
కానీ వెనక ఉన్న బ్యాక్ ప్యానెల్ సూర్యకాంతిని సంగ్రహించేందుకు సోలార్ ప్యానెల్‌లా పనిచేస్తుంది.
బ్యాక్ కాంటాక్ట్ సెల్ సాంకేతికతతో మార్కెట్‌లోకి వస్తోంది.
ఈ ల్యాప్‌టాప్‌లో 24 శాతం కంటే ఎక్కువ సౌరశక్తిని సమర్థవంతంగా మార్చగల సోలార్ ప్యానెల్ ఉంది.
ఎండలో కేవలం 20 నిమిషాల ఉంచితే గంట సేపు వీడియోను ప్లే బ్యాక్ చేయొచ్చు.
ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది.
లెనోవో తెచ్చిన ఈ సౌరశక్తి పర్సనల్ కంప్యూటర్ బరువు కేవలం 1.22 కిలోలు మాత్రమే.
దీని మందం కేవలం 15 మిమీ. దీంతో ఈ ల్యాప్‌టాప్ చాలా సన్నగా, తేలికగా ఉండటంతో దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా ఉంటుంది.