TTD9th Sep 11:31 AMSunil Byrisetty1 min read

తిరుపతి జిల్లాలో చిరుత కలకలం!

తిరుపతి జిల్లా చిట్వేలి–రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఘాట్ రోడ్డులో తరచూ చిరుతలు కనిపిస్తుండటంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నా

తిరుపతి జిల్లాలో చిరుత కలకలం!
తిరుపతి జిల్లా చిట్వేలి–రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఘాట్ రోడ్డులో తరచూ చిరుతలు కనిపిస్తుండటంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. చిరుతలు సంచరించే ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం ప్రమాదకరమని.. అత్యవసరం అయితే తప్ప రాత్రివేళ ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఘాట్ రోడ్డులో చిరుతల సంచారంపై అటవీశాఖ అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు..
Andhra Pradesh
Tirupati
Leopard Movement
Chitvel
Rapuru
Ghat Road
Tirupati District
Forest Department
చిరుత
వన్యప్రాణులు
వాహనదారులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article