News30th Dec 05:39 PMSunil Byrisetty1 min read

ప్ర‌గ‌తి నావ ప‌య‌నాన్ని ప‌రుగులు పెట్టిద్దాం..

ఏడాది కాలంలో స‌మ‌ష్టి కృషితో ఎన్నో విజ‌యాల‌ను సొంతం చేసుకున్నామ‌ని.. ఈ ప్ర‌గ‌తి ప‌థం స్ఫూర్తిగా ఇక‌పైనా స‌రైన విశ్లేష‌ణ‌తో వినూత్నంగా జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి ముంద‌డుగు వేద్దామ‌ని

ప్ర‌గ‌తి నావ ప‌య‌నాన్ని ప‌రుగులు పెట్టిద్దాం..
ఏడాది కాలంలో స‌మ‌ష్టి కృషితో ఎన్నో విజ‌యాల‌ను సొంతం చేసుకున్నామ‌ని.. ఈ ప్ర‌గ‌తి ప‌థం స్ఫూర్తిగా ఇక‌పైనా స‌రైన విశ్లేష‌ణ‌తో వినూత్నంగా జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి ముంద‌డుగు వేద్దామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎంతో క‌లిసి కీల‌క ప్ర‌గ‌తి సూచిక‌ల‌(కేపీఐ)తో పాటు జిల్లా అభివృద్ధికి, ప్ర‌జ‌ల క్షేమం, సంక్షేమానికి ఏడాది కాలంగా చేపట్టిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు, సాధించిన విజ‌యాలు, వాటి స్ఫూర్తితో కొత్త ఏడాది కార్యాచ‌ర‌ణ‌పై స‌మీక్షించారు. 12 నెల‌ల కాలంలో మైలురాళ్లను గుర్తుకు తెస్తూ వ‌చ్చే ఏడాదిలో స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఉద్ఘాటించారు. ప్ర‌భుత్వ ప్రాధాన్యాత‌ల‌కు అనుగుణంగా చెప్పుకోద‌గ్గ ఫ‌లితాలు సాధించామ‌ని వివరించారు. కేపీఐలో రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలవ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. యోగాంధ్ర సంద‌ర్భంగా ప్ర‌పంచ రికార్డుల న‌మోదు, స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ జాతీయ‌స్థాయి పుర‌స్కారాలు, ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధి సూచిక‌ల్లో నీతి ఆయోగ్ బంగారు ప‌త‌కాలు.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో గుర్తింపులు సాధించామ‌న్నారు.
Andhra Pradesh
District Development
Progress Review
Collector Lakshmisha
Key Performance Indicators (KPI)
Public Welfare
Government Initiatives
నూతన సంవత్సరం కార్యాచరణ
స్వచ్ఛ సర్వేక్షణ్
నీతి ఆయోగ్
యోగ
Scroll for the next article