News26th Jan 04:47 PMSunil Byrisetty1 min read

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందాం

దేవుని ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందాం
దేవుని ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఆత్మకూరులో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న లూథరన్ క్రీస్తు కరుణాలయం, కమ్యూనిటీ హాల్ ను సోమవారం మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎవరూ ఊహించని విధంగా మందిరాన్ని పునః నిర్మాణం చేయడం అభినందనీయమని అన్నారు. మందిరం పునః నిర్మాణంలో తనకు కూడా దేవుడు భాగస్వామ్యం కల్పించాడన్నారు. ఏ పని చేసినా ఒక సంకల్పం, పట్టుదలతో చేయాలని, కాలం ఉంది కదా అని ఎక్కువ సమయం తీసుకోరాదన్నారు. ఏదైనా ఒకటి అనుకుంటే ఎన్ని పరీక్షలు వచ్చినా అది సాధించాలన్నారు. ఏడాదిలోగా మందిరాన్ని పునః నిర్మాణం చేయాలని నిర్మాణ కమిటీకి తాను సూచించానని, తన కోరిక మేరకు ఏడాదిలోగా మందిరాన్ని అద్భుతంగా పునః నిర్మాణం చేశారని కొనియాడారు. దేవుడు మనకు పరీక్షలు పెడతాడని, ఒక్కో కుటుంబానికి ఒక్కో పరీక్ష పెడతాడన్నారు. నేటి సమాజంలో చాలామంది పరీక్షలకు భయపడుతున్నారన్నారు. విద్యార్థులు ఒక్క పరీక్షలో తక్కువ మార్కులు వస్తేనే అధైర్య పడుతున్నారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవలసిన అవసరం లేదని, ఆ పరీక్షలను జయించే శక్తి కూడా దేవుడు మనకు ఇస్తాడన్నారు.
Andhra Pradesh
Nara Lokesh
Mangalagiri Constituency
Model Constituency
IT and Education Minister
Community Hall Inauguration
కమ్యూనిటీ హాల్ ప్రారంభం
ప్రజాసేవ
నాయకత్వ సందేశం
Scroll for the next article