News4th Mar 04:16 PMSunil Byrisetty1 min read
ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో భాగస్వాములమవుదాం
మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని.. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్‌టీఆర్ జిల్లాను నెం.1లో నిలిపేందుకు సమష్టి
మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని.. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్‌టీఆర్ జిల్లాను నెం.1లో నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
మంగళవారం విజయవాడలోని లయోలా కళాశాల ఎదురుగా ఉన్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రిసోర్స్ పర్సన్లు, యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు, మోడల్ మేకర్ ట్రైనర్లు తదితరులకు ప్రకృతి వ్యవసాయం-ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్‌షాప్ జరిగింది.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల్లో ఉన్న అపోహలను తొలగించి..
ఆరోగ్యకర ఉత్పత్తులతో సమాజానికే మేలు కలిగించే సాగు విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ర్యాలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు, పొలం సందర్శనలు వంటివి నిర్వహించాలన్నారు.
తాను సేంద్రియ వ్యవసాయంలో పీహెచ్‌డీ చేయడం జరిగిందని.. రసాయన పురుగు మందులు, ఎరువులు మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని..
సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు/ద్రావణాలు తదితరాల వినియోగం వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు చేతికందుతాయని కలెక్టర్ వివరించారు.