News18th Oct 03:39 PMSunil Byrisetty1 min read

కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగం కావాలి!

అవసరం మేరకే వాహనాలు ఉపయోగించి, వాయు, శబ్ధ కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆం

కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగం కావాలి!
అవసరం మేరకే వాహనాలు ఉపయోగించి, వాయు, శబ్ధ కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వాయు, శబ్ధ కాలుష్య రహిత సమాజం నిర్మాణంపై శనివారం ఉదయం ఆయన మచిలీపట్నం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ నుండి కోనేరు సెంటర్ మీదుగా మూడు సంభాల సెంటర్ వరకు అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన సైకిల్ తొక్కుతూ నగర పౌరులకు అవగాహన కల్పించారు. నగరంలో మూడు స్థంబాల సెంటర్ వద్దకు చేరుకుని అందరి చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ వాహనాల వినియోగం పెరిగి, వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. అందుకే వాహన వినియోగం తగ్గించాలని సూచించారు.
Andhra Pradesh
Krishna District
DK Balaji
Machilipatnam
Pollution Free Society
Air Pollution
Noise Pollution
Swarna Andhra Swachh Andhra
Cycle Rally
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
ప్రజా అవగాహన
Scroll for the next article